ఆ యువ‌తి ఫుల్‌గా తాగి మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా

193

The bullet news(et)-

ప్రేమించి, పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చిన వ్య‌క్తి మోసం చేస్తే చాలా మంది నిరాశ‌లో కూరుకుపోతారు. కొంత‌మంది ఆత్మ‌హ‌త్య కూడా చేసుకుంటారు. మ‌రికొంత‌మంది ప‌లు మార్గాల ద్వారా అతనికి బుద్ధిచెబుతారు. అయితే హ‌రియాణాకు చెందిన ఓ యువ‌తి మాత్రం వినూత్నంగా ప్ర‌వ‌ర్తించింది. పీకల వ‌ర‌కు తాగి అత‌డి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసింది.
హ‌రియాణాలోని ప‌టౌడికి చెందిన ఓ యువ‌తి, యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎంతో ప్రేమ‌గా మెలిగిన యువ‌కుడు కొన్నాళ్ల‌కు ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. ఆమెను వ‌దిలేశాడు. దాంతో ఆ యువ‌తి పీకల దాకా తాగి ప్రియుడి ఇంటికి వెళ్లింది. త‌న‌తోపాటు ఓ డీజేను కూడా వెంట‌పెట్టుకుని వెళ్లింది. అక్క‌డ `రాజా హిందూస్థానీ` సినిమాలోని `తేరే ఇష్క్ మే` పాట‌కు చిందులేసింది. చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాళ్లు చూస్తున్నార‌నే స్పృహ కూడా లేకుండా వీరంగం సృష్టించింది. ఈ యువ‌తి డ్యాన్స్‌ను అక్క‌డే ఉన్న యువ‌కుడు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైర‌ల్‌గా మారింది.
SHARE