నందవరంలో పొలంలో విషాదం…రైతు మృతి

209

మర్రిపాడు మండలం, నందవరంలో పొలంలో విషాదం చోటుచేసుకుంది కళ్ళకొటి వెంకట సుబ్బారెడ్డి59 అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పొలం వైపు వెళ్లిన ఓ రైతు గమనించి కుటుంబ సబ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పొలం దగ్గరకు పరుగులు తీసేటప్పటికే మృతి చెందాడు. వెంకట సుబ్బారెడ్డి మృతి చెందాడనే వార్త తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకట సుబ్బారెడ్డి చెందడంతొ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.