నిద్రలో వచ్చే కలలు నిజమవుతాయా లేదా..

75

The Bullet News – Interesting..

కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది.. కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. మనసు కవి ఆత్రేయ కలం నుంచి జాలువారిన అక్షర సుమాలు. అలసిన శరీరం ఆదమరచి నిద్రపోతుంది. కలత నిద్రలో కలలకు అవకాశం లేదు. ఓ అందమైన కల వస్తే నిజం అయితే ఎంత బావుండు అనిపిస్తుంది. భయంకరమైన కల అయితే భయపెడుతుంది. నిజానికి అన్ని కలలు గుర్తుండవు. కొన్ని మాత్రమే వెంటాడుతుంటాయి.

అనుభవజ్ఞులు, పెద్దవారు కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెబుతుంటారు. అవి మెలకువలో చేసే ఆలోచనలు. మరి నిద్రపోయినప్పుడు వచ్చే కలల మాటేమిటి.. ప్రతి మనిషికి జీవితకాలంలో ఎన్నో కలలు వస్తుంటాయి. రాత్రి నిద్రలో వచ్చిన ఓ మంచి కల కూడా తెల్లారి లేచేసరికి అస్పష్టంగా అనిపిస్తుంది. ఏదీ సరిగా గుర్తుండదు. మనిషి తన జీవిత కాలంలో 25 ఏళ్లు నిద్రకు కేటాయిస్తారు. ఒక్కొక్కరి జీవిత కాలంలో 6 సంవత్సరాలు కలలకే సరిపోతాయి. మెలకువగా ఉన్నప్పుడే బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుందనుకుంటాము.
నిద్రపోతున్నప్పుడు కూడా మెదడు బాగా పనిచేస్తుంది. నిద్రలో రెండు మూడు గంటలకి ఒకసారి కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు డ్రీమ్ డిక్షనరీని తయారు చేశారట. శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కలలు రావు. అంతే కాదు స్త్రీలకు, పురుషులకు వచ్చే కలలో కూడా తేడా వుంటుంది. పురుషులు ఎక్కువగా స్త్రీల గురించే కలలు కంటారు. అదే స్త్రీలకయితే స్త్రీలు, పురుషుల గురించి కలలు వస్తుంటాయి. మళ్లీ ఇందులో మధ్యం సేవించే వారికి, పొగతాగేవారికి కలలు ఎక్కువగా వస్తుంటాయి.
వీళ్లకు ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి. కొంత మంది కలలు ఊహాజనితంగా ఉంటాయి. గాల్లో తేలుతున్నట్లు, గోడలు ఎక్కుతున్నట్లు, అందమైన ప్రాంతాలకు వెళ్లినట్లు కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలలు 30 నిమిషాలు మాత్రమే వస్తాయి. నిద్రలో గురక పెట్టే గురక వీరులకు అసలు కలలు వచ్చే అవకాశమే లేదు. గురక పెట్టే వారినుంచి దూరంగా ఎలా అయితే మనుషులు పారిపోతారో కలలు కూడా అలానే వారి దరి చేరవు. మూడేళ్లు దాటిన పిల్లలకు ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి. నిద్రలో ఉలిక్కిపడడం ఇలాంటిదే. కళ్లుంటేనే కాదండోయ్… కళ్లు లేని వారికి కూడా కలలొస్తుంటాయి. స్లీప్ డిజార్డర్ ఉన్న వాళ్లు భావోద్వేగానికి గురై దెబ్బలు తగిలించుకుంటారు. కొంతమంది నిద్రలోనే ఇంటికి నిప్పు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయట.

ఇల్లు కూల్‌గా ఉంటే కమ్మగా నిద్రపోతారు, కలలు కూడా తక్కువగా వస్తాయి. కొంత మంది కలల్ని సాకారం చేస్తుంటారు. అలా ఆవిష్కరించిందే గూగుల్. కొంతమందికి కలలు భవిష్యత్తులో ఏంజరగబోతోందో హెచ్చరిస్తూ కలలు వస్తుంటాయి. కొంతమంది కలలో నడుచుకుంటూ చాలా దూరం వెళుతుంటారు. ఇలాగే ఒకాయన మూడో అంతస్తునుంచి దూకేస్తే.. మరొకరు 20 కిలోమీటర్లు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారట. కొంతమందికి కలలు వారి సమస్యలకు పరిష్కార మార్గాలు. కోపం, బాధ, భయం ఇలాంటి భావోద్వేగాలే కలల రూపంలో కవ్విస్తుంటాయి

SHARE