పేదల డాక్టర్ … జి కొండా రెడ్డి కన్నుమూత..

పేదల డాక్టర్ … జి కొండా రెడ్డి కన్నుమూత ఆత్మకూరులో లో 60 ఏళ్ల క్రితం సొంతంగా ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలందిస్తూ… పేదల డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ కొండారెడ్డి ఈరోజు సాయంత్రం ఆసుపత్రి లో గల ఆయన నివాస గృహంలో కన్నుమూశారు .మూడు రోజులుగా వయోభారం వల్ల తలెత్తిన నీరసంతో ప్రాథమిక వైద్యం పొందుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. *ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కిసమకాలికులు గా వైద్యరంగంలో కొండారెడ్డి ప్రఖ్యాతి పొందారు. . *గత 30 ఏళ్లుగా ఆయన కుమార్తె అరుణ, అల్లుడు జి సుధాకర్ రెడ్డి* ఆత్మకూరు పట్టణంలోని కేకేఆర్ హాస్పిటల్స్ ను నిర్వహిస్తూ… నెల్లూరు, కడప జిల్లా లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ పేరుగాంచారు. కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో…. ఈరోజే అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్లు కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here