యోగి రాష్ట్రంలో దారుణం… 40 మందికి ఎయిడ్స్ ఎక్కించిన డాక్టర్..

186

The bullet news(crime)-ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకేసారి 40 మంది ఎయిడ్స్ బాధితులుగా తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుడినంటూ చెప్పుకునే ఓ వ్యక్తి తనవద్దకు వచ్చే రోగులందరికీ ఇంజక్షన్‌ల కోసం ఒకే సిరంజి ఉపయోగించినట్టు చెబుతున్నారు. ఆ కారణంగానే బాధితులకు ఎయిడ్స్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో నగరంలో జరిగిన ఓ హెల్త్ క్యాంప్ సందర్భంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో సరైన విధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే మరో 500 కేసులు బయటపడే అవకాశం ఉందని బంగార్మావ్ కౌన్సిలర్ సునీల్ పేర్కొన్నారు.

ప్రత్యేకించి ఉన్నావ్ రవాణాకు కేంద్రం కావడంతో అనేకమంది ట్రక్ డ్రైవర్లు ఇక్కడే బసచేస్తారు. ఇక్కడ హెచ్‌ఐవీ వ్యాప్తి చెందడానికి ఇది కూడా ఓ కారణమని అనుమానిస్తున్నారు. కాగా యూపీ ఆరోగ్యమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘ ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాం. ఈ దారుణానికి కారకులైన అందరిపైనా, లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతం రవాణాకు ముఖ్యకేంద్రం కావడంతో హెచ్‌ఐవీ వాహకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే ట్రక్ డ్రైవర్లందర్నీ గర్తించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తాం..’’ అని పేర్కొన్నారు.
SHARE