వీర్య కణాల వృధ్ధికోసం ఏం చెయ్యాలి

239

The bullet news ( Health) _పిల్లలు పుట్టని చాలామంది దంపతుల్లో ఆడవాళ్లలో లోపమెంతో మగవాళ్లలోనూ ఆ లోపముంటుంది. మగవాళ్లలో లోపం సాంకేతిక యుగంలో తెచ్చిపెట్టుకునే లోపంగానే కనిపిస్తోంది. అందువల్లనే మారిన జీవనశైలికి దూరంగా ఉంటే సంతాన లోపంతో బాధపడే మగవారిలో ప్రయోజనం కలిగే అవకాశముంది. 30శాతం సంతాన హీనతలో మగవారిలో వీర్యలోపం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి.
1. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగడం – కూల్ డ్రింక్స్ మీద మోజుతో అతిగా కూల్ డ్రింక్స్ తాగితే వీర్యంలో జీవకణాలు చచ్చిపోతాయి. బీర్ తాగినా ఇదే పరిస్థితి. ఎంత బీరు తాగితే అంత శక్తి ఉందని విర్రవీగే వారికి, తాగే ప్రతి గ్లాస్ బీర్ కి వీర్యంలో జీవకణాలు చచ్చిపోతున్నాయని తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం బీర్ లోనూ, ఇతర కార్పొనేటెడ్ డ్రింక్స్ లోనూ ఉండే రసాయనాలు శరీరంలోని ఇన్సులిన్ ని అడ్డుకుని వీర్య కణాల పరిస్థితిని నీరుగారుస్తున్నాయి. అందువల్ల సంతాన లోపంతో బాధపడే మగవారు కూల్ డ్రింక్స్ కు, బీర్ కు దూరంగా ఉండాలి.
2. మొబైల్ ఫోన్ ఫ్యాంట్ జేబులో పెట్టుకోవడం – మొబైల్ ఫోన్ ను ఫ్యాంట్ జేబులో పెట్టుకోవడం సంతాన లోపంతో బాధపడే మగవారిలో ప్రమాదకరం. మీకు తెలియకుండానే మొబైల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వీర్యానికే మహా ప్రమాదకరంగా సంక్రమించింది. సంతానోత్పత్తి గ్రంథులకు మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకుంటే తప్పనిసరిగా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది 9నుంచి 32శాతం వరకు వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుందని ఇటీవల పరిశోధనలు తేల్చాయి.
3. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోవడం – ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేసుకోవడం సులభంగానే ఉన్నా, ఆడవారికి గానీ మగవారికి గానీ ఇది మంచి పద్ధతి కాదు. వీర్య కణాల ఉత్పత్తికి సహకరించే మగవారి వృషణాల్లో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉంటేనే వీర్య కణాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. అలా లేని పక్షంలో ల్యాప్ టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఒడిలో పెట్టుకుని పనిచేస్తే వాటినుంచి వెలువడే ఉష్ణోగ్రతకు వృషణాల్లోని వీర్య కణాలు చచ్చిపోతాయి. అందువల్ల సంతాన లోపంతో బాధపడే మగవారిలో వీర్యకణాల సంఖ్యను పెంచాలంటే ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం మానుకోవాలి.
4. నిద్రలేమి – దేహానికి, మెదడుకు విశ్రాంతి ఎంత ముఖ్యమో.. వీర్య కణాలకు అంతే ముఖ్యం. వీర్య కణాలను ఉత్పత్తి చేసే గ్రంథులు విశ్రాంతిని కూడా కోరుకుంటాయి. అందువల్ల రోజుకు 7, 8 గంటలపాటు నిద్రపోవడం సంతానలోపంతో బాధపడే పురుషులలో కానీ, మహిళలలో కానీ తప్పనిసరి. ఇలా ఉంటేనే వీర్య కణాల కదలిక బాగా ఉంటుంది. యోగా కూడా మంచిదే.
5. బిగుతైన జీన్స్ వేసుకోవడం – ఫ్యాషన్ కోసమో, అందం కోసమో స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ వేసుకోవడం సంతాన లోపంతో బాధపడే మగవారికి మంచిది కాదు. వీర్య కణాల సంఖ్యను ఇటువంటి వస్త్రధారణ గణనీయంగా తగ్గిస్తుంది. ఈ స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ వల్ల వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాల్లో ఉష్ణోగ్రత పెరిగి, వీర్య కణాలను చంపేస్తాయి. ఇవే కాకుండా మానసికమైన ఆందోళన, పొగతాగడం, మద్యం సేవించడం, సన్ స్క్రీన్ లోషన్లు అతిగా వాడటం, తదితర అలవాట్లు కూడా మగవారిలో వీర్య లోపానికి కారణాలు.

SHARE