ఘోర విమాన ప్రమాదం… 20మంది సజీవ దహనం..

115

The bullet news(aeroplane)-  నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్యాసెంజర్ విమానం ల్యాండ్ అవుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 67 మంది ప్రయాణిస్తున్నారు.

  అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికి 17 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేసి ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
SHARE