చిరమన లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. నలుగురికి తీవ్ర గాయాలు..

407

THE BULLET NEWS (ATMAKUR)-నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో పొలంలో దారి విషయం మై చెలరేగిన గొడవ అన్నదమ్ముల‌‌ మమధ్య ఘర్షణకు దారితీసింది.గ్రామానికి చెందిన గోపాలయ్యకు గ్రామ శివారులో పొలాలు ఉన్నాయి. అతని పొలాల పక్కనే వరుసకు అన్నదమ్ములైన మరో ఇద్దరి పొలాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలో ఇరువురి మధ్య దారి విషయంలో చాలా రోజుల నుండి గొడవ జరుగుతూ ఉండేది.అయితే ఈ రోజు ఉదయం అదే దారి విషయమై జరిగిన గొడవ కాస్త పెరిగి పెద్దదవడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు దిగారు.ఈ ఘర్షణలో గోపాలయ్య ,సుబ్రహ్మణ్యం ,వెంకట సురేష్,మరో వ్యక్తితో సహా నలుగురికి తీవ్ర గాయాలు అవడంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంకట సాయి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఘర్షణ కు గల కారణాల పై దర్యాప్తు చేస్తున్నారు..

సేకరణ…- రాజేష్..( ఆత్మకూరు)

SHARE