శ్రీవారి భక్తుడిగా నా బాధను చెప్పా…- మంత్రి సోమిరెడ్డి..

205

THE BULLET NEWS (AMARAVATHI)-రమణ దీక్షితులను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. అమరావతి మీడియాతో మాట్లాడిన ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.. బీజేపీ-వైసీపీ నేతలతో కుమ్మక్కై రమణ దీక్షితులు చేస్తోన్న ప్రయత్నాలనే తప్పు పట్టానన్నారు . బ్రాహ్మణులు అంటే తెలుగుదేశం పార్టీకి, తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.. శ్రీవారి సేవలో ఇన్నాళ్లు పని చేసిన రమణ దీక్షితులు ఇప్పుడు శ్రీవారికే అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే ఆవేదనలో మాట్లాడనన్నారు.. భక్తులకు రక్షణ ఇచ్చే ఇలవేల్పు వెంకటేశ్వర స్వామే.. తనకు వచ్చిన కానుకలను రక్షించుకోలేకపోతున్నారనే రీతిలో రమణ దీక్షితులు చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తట్టుకోలేకపోయానన్నారు.. శ్రీవారి భక్తుడిగా నా బాధను.. ఆవేదనను వెలిబుచ్చానని వివరించారు..రమణ దీక్షితుల వ్యవహారాన్ని బ్రాహ్మణ సమాజం సమర్ధించగలదా అంటూ ఆయన ప్రశ్నించారు.. రమణ దీక్షితుల ఆరోపణలు, వ్యవహారశైలిపై బ్రాహ్మణ సంఘాలు, నాయకులు, శ్రీవారి భక్తులు ఆలోచించాలన్నారు..

రమణ దీక్షితులు ఎవరెవరితో భేటీ అవుతున్నారనే విషయాలను బ్రాహ్మణ వర్గాలు గమనించాలని కోరారు..
టీటీడీ వివాదాన్ని రాజేసి టీడీపీని ఇబ్బందులకు గురిచేయాలనే కుట్రలో రమణ దీక్షితులు పావుగా మారారని సోమిరెడ్డి ఆరోపించారు..

SHARE