ముదివర్తి లో ఇసుక దోపిడీ..చోద్యం చూస్తున అధికారులు..

128

THE BULLET NEWS (VIDAVALUR)-సంపాదనే లక్ష్యంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. .  ఏకంగా ట్రాక్టర్‌లకు  పెద్ద సైజులో ట్రక్కును తయారు చేయించుకుని ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వాస్తవంగా ట్రాక్టర్ ట్రక్కు సైజు 10 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు, 18 నుంచి 20 అంగుళాలలోపు ఎత్తు ఉంటుంది.

అయితే అక్రమార్కులు మాత్రం ట్రక్కులను 14 అడుగుల వెడల్పు, ఏడు అడుగులకు పైగా వెడల్పు, 18 నుంచి 20 అంగుళాల లోపు ఎత్తు సైజును తయారు చేయించుకుని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా కోవూరు మండలంలో జమ్మిపాళెం, వేగూరు, విడవలూరు మండలం సుబ్బారెడ్డిపాళెం, ముదివర్తి తదితర ప్రాంతాల్లోని రీచ్‌ల నుంచి ఈ యథేచ్ఛగా సాగుతోంది.

కోవూరు మండలంలోని వేగూరు రీచ్‌కు అధికారికంగా అనుమతి లేకపోయినా 365 రోజులూ ఇక్కడ ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా ముడుపులు అందుతున్నాయనే విమర్శలున్నాయి.

SHARE