అవినీతి అధికారులు వల్ల రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. – జేడీ లక్ష్మీనారాయణ

101

THE BULLET NEWS (KOVUR)-నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నెల్లూరుజిల్లా వచ్చిన మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ జిల్లాలో పలు ప్రాంతాల్లో, పలు సామాజికవర్గాలు, రైతులతో సమావేశాలు నిర్వహించారు.. కోవూరు మండలం పోతిరెడీపాలెం లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ని పరిశీలించి షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది తో చెరకు రైతులతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ సమావేశం అయ్యారు అనంతరం ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు , సిబ్బంది మరియు రైతులు సమస్యలు బకాయిలు అందక చాలఇబ్బందులు పడుతున్నామని జెడి లక్ష్మినారాయణ కు బాధలు తెలిపారు అనంతరం సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అవినీతి వల్లే ఈ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు దేశంలో అవినీతి నిర్ములించిన రోజే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు

SHARE