నత్తతో పోటీపడుతున్న సోమశిల హైలెవల్ కెనాల్ పనులు – సిపిఎం నాయకులు మూలి కామెంట్స్

114

THE BULLET NEWS (MARRIPADU)-హైలెవల్ కెనాల్ నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం జరుతుందని సిపిఎం ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి మూలి వెంగయ్య మండిపడ్డారు.. శనివారం మర్రిపాడు మండలంలోని నందవరం, రాంపల్లి, రామనాయుడు పల్లి, డిసి పల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రిపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో సాగు, తాగునీరు లేక ఊళ్లు వలస పోతున్నాయన్నారు.. ఉపాధి లేక యువత నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల హైలెవల్ కాలువ నిర్మాణం వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.. పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.. పనులు ఇలాగే జరిగితే మరో పదేళ్లు అయినా పనులు పూర్తి కావన్నారు. అంతు లేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు.. 2013భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు..
కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి మూలి వెంగయ్య. మహమ్మద్ గౌస్ . ఐద్యా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు

SHARE