కావలి విట్స్ కాలేజి విద్యార్థిని పరిస్థితి విషమం.. చెన్నైలో చికిత్స

175

THE BULLET NEWS (CHENNAI)-కావలి విట్స్ కాలేజి ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కాలేజీలో పురుగుల అన్నం తిన్న ఓ నిరుపేద విద్యార్థిని కాంచన చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉంది.. కాంచన ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతూ ఉంది.. అసలే నిరుపేద కుటుంబం కావడం, ఇప్పటికే దాదాపు 8 లక్షల దాకా ఖర్చు అవ్వడంతో కాంచన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.. మరోపక్క ఈ వ్యవహారం పై విట్స్ కాలేజి యాజమాన్యం స్పందించడం లేదు. బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కాంచన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.. కాలేజి వాటర్ ట్యాంక్ లో కోతి చనిపోవడం, అవే నీటిని కాలేజి విద్యార్థులకు సరఫరా చెయ్యడంతో కాంచన ఈ దుస్థితికి చేరింది.. వైద్య సహాయం అందించేందుకు విద్యార్థులు ముందుకు వస్తున్నప్పుటికీ విట్స్ కాలేజి యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.. తమకు సంబంధం లేదు అన్నట్లు వ్యవరిస్తోంది.. వేలకు వేలు ఫీజులు తీసుకుని విషాపురితమైన ఆహారాన్ని అందించడం వల్లే కాంచనకు ఈ దుస్థితి దాపురించిందని కాంచన తల్లిదండ్రులు వాపోతున్నారు.. దీనిపై విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు సిద్ధమౌతున్నారు…

SHARE