హాస్పటల్ సూపరింటెండెంట్ ను వెంటనే అరెస్టు చెయ్యాలి..

84

THE BULLET NEWS (NELLORE):-నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యుల నిర్లక్ష్యం, బరితెగింపు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.. అక్కడ పని చేసే మహిళా డాక్టర్ పై లైంగిక వేధింపుల కేసులో ఉన్న హాస్పటల్ సూపరింటెండెంట్
డాక్టర్ రాధాకృష్ణ రాజును వెంటనే అరెస్టు చేయాలని బీజేవైఎం నాయకులు ఆందోళన నిర్వహించారు.. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.. మహిళ డాక్టర్ పై లైంగీక వేధింపులకు పాల్పడ్డ సూపరింటెండెంట్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మొగరాల సురేష్ డిమాండ్ చేశారు.. బాధ్యతయుతమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి పనులకు పాల్పడుతున్న అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు..

SHARE