చిన్నబజారు పోలీసులకు చిక్కిన కన్నింగ్ కపుల్స్..

209

The bullet news (Nellore)_  పక్కింటోళ్లతో కలివిడిగా ఉండాల్సిన వారు కన్నింగ్ పనులకు తెరలేపారు.. ఎవ్వరూ లేని సమయంలో పక్కింట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.. మూడు లక్షల నగదు, బంగారు నగలు పట్టుకెళ్లారు.. దొంగతనం దాచినా దాగదంటారు కదా.. సీసీ కెమెరా కన్నింగ్ కపుల్స్ ను పట్టించాయి.

నెల్లూరు నగరంలోని వీబీఎస్ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న విరాట్ నగర్ లో మహబూబ్ బాషా అనే కాంట్రాక్టర్ ఉంటున్నాడు.. ఆయన భార్య పిల్లలు ఊరికి వెళ్లడంతో పక్కింట్లో ఉంటున్న కామినేని శ్రీహరి, హారిక మహాబూబ్ బాషా ఇంట్లో ఉండే మూడు లక్షల నగదు, బంగారాన్ని చోరీ చేశారు.. మారుతాళంతో ఇంట్లోకి ప్రవేశించి ఈ దొంగతనానికి ఒడిగట్టారు.. దొంగతనం జరిగే ఇంటికి ఎదురుగా ఉన్న ఓ షాప్ కు సంబందించిన సీసీ కెమెరాను పరిశీలించిన చిన్నబజారు పోలీసులకు పక్కింట్లో ఉండే కామినేని శ్రీహరి, కామినేని హారికనే దొంగతనం చేసినట్లు నిర్దారించుకుని వారిని అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి సొత్తు రికవరీ చేశారు..

SHARE