అధికారం ఉన్నా.. లేకున్నా నేనెప్పుడూ ప్రజల్లోనే ఉంటా…- మంత్రి సోమిరెడ్డి

113

THE BULLET NEWS (UDAYAGIRI)- అధికారం ఉన్నా.. లేకపోయినా తానెప్పుడూ ప్రజాల మధ్యలోనే తిరుగుతూ ఉంటానని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. వింజమూరులోని జెడ్పీ హైస్కూలు మైదానంలో జరిగిన మినీ మహానాడు లో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఉదయగిరి నియోజకవర్గంలో వర్షాలు తక్కువ అయినా ఇక్కడి ప్రజలకు టీడీపీ అంటే మక్కువ ఎక్కువన్నారు..
జిల్లాలో సాగునీరు, అటవీ అనుమతులు, ధాన్యం ధరలు, పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లు..ఇలా రైతులు, సామాన్య ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి శక్తిమేర పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.. తెలుగు గంగ ప్రాజెక్ట్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న అటవీ అనుమతుల కోసం స్వయంగా అప్పటి అటవీ శాఖ మంత్రి బొజ్జల కార్యాలయానికి వెళ్లి ఆయన సహకారంతో సమస్య పరిష్కరించుకొచ్చానని..తద్వారా లక్ష పదివేల ఎకరాలు అదనపు ఆయకట్టు తెచ్చామన్నారు.. సామాజిక పింఛన్ల రూపంలో ప్రతి నెలా ఒక్క నెల్లూరు జిల్లాలోనే రూ.29 కోట్లు అందజేస్తు న్నామన్నారు. ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన జీవితబీమాను ప్రతి పేద కుటుంబానికి వర్తింప చేసిన ఘనత చంద్రబాబు గారిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది పేదలకు ప్రభుత్వమే జీవిత బీమా చేయించడం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా.. అంటూ ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు చంద్రన్న పెళ్లికానుక, దుల్హన్, గిరిపుత్రిక కళ్యాణం పథకం ద్వారా ఆర్థికసాయం చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు. సీజేఎఫ్ఎస్ ని రద్దు చేసి జిల్లాలో 8 వేల కోట్లకు పైగా విలువైన భూములపై లబ్ధిదారుల వారసులకు భూయాజమాన్య హక్కులు కల్పించబోతున్నామన్నారు..లక్ష ఎకరాల చుక్కల భూములకు కూడా విముక్తి కల్పించి రైతులకు సమస్య లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఒకాయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రోడ్లపై తిరుగుతున్నారని ఆయనకి అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలు పట్టవని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు..మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నీకు పేదలు, వారి కష్టాలు గుర్తుకు రాలేదా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు..ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగినా వాళ్లు కరుణించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రపక్ష సీఎం అయిన చంద్రబాబుకి అపాయిట్మెంట్ ఇవ్వకుండా 12 కేసుల్లో నిందితులైన ఏ1జగన్ ను బెడ్రూమ్ లో, ఏ2 విజయసాయి రెడ్డిని బాత్రూమ్ లో కూర్చోబెట్టుకుని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు.యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడంతో జగన్ దిగులుపడిపోయాడని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో కర్ణాటకలోని తెలుగువారు స్పందించి బీజేపీకి తగిన శాస్తి చేశారన్నారు.జగన్ తో కలిసి ఏపీని నాశనం చెయ్యడానికి బిజెపి యత్నిస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, మహానాడు పరిశీలకులు, నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు..

SHARE