అభివృద్ధి పై అబద్దాలు ఆడటం టిడిపికి అలవాటే – వైసీపీ స్టూడెంట్ లీడర్స్

100

THE BULLET NEWS (VENKATACHALAM)-ఒకరు చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోవడం మంత్రి సోమిరెడ్డికి మొదటి నుంచి అలవాటే అని దని వైసీపీ విద్యార్ధి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నపనేని పెంచలనాయుడు ఆరోపించారు.. విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన వెంకటాచలం మండలం లో అనికేపల్లి పంచాయతీ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో రోడ్లు మంజూరు చేయించామని అనికేపల్లి సర్పంచ్, గొలగముడి లోని స్థానిక టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు..టిడిపి హయాంలో తమ పంచాయతీ కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు.. ఎమ్మెల్యే కాకని కృషితోనేఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, గ్రామాలకు సంబంధించిన రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. పంచాయతీ రాజ్, గ్రామాభివృద్ధి శాఖ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గం లో రూ 20.97కోట్లు, వెంకటాచలం మండలం లో రూ 3,12,9000 రూ తో, అనికేపల్లి పంచాయతీ లో అనికేపల్లి ఆర్ & బి నుండి చెర్లోపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి 37,00000 రూ, అలాగే వెంకటాచలం మండలం కసుమూరు ఆర్&బి నుండి వెంకట కృష్టాపురం గ్రామం వరకు 2,75,9000 రూ రోడ్లకు నిధులు మంజూరు కావడంలో ఎమ్మెల్యే కృషి అనిర్వచనీయమన్నారు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ని చూసి ఓర్వలేక ఎక్కడ అభివృద్ధి జరిగిన తమ చలవేనని చెప్పుకోడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని పెంచలనాయుడు హెచ్చరించారు.. ఈ సమావేశంలో నాయకులు ప్రవీణ్, గోవర్ధన్, వెంకటేష్, భువన్ కుమార్, రాజేష్, సుకుమార్, రోహిత్, విష్ణు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

SHARE