నెల్లూరుజిల్లాలో 37 మంది చీటింగ్ డీలర్లు అరెస్టు

145

The bullet news (Nellore)_ పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తింటున్న 37 మంది రేషన్ డీలర్లును నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి దాదాపు 10 లక్షల విలువ చేసే బియ్యం, పంచదార, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. .దీనికి సంబంధించిన వివరాలను సీసీఎస్ డిఎస్పీ శ్యామ్ బాలసుందర్ రావు మీడియాకు వివరించారు..

నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలోని శ్రీనివాసరాజు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో రేషన్ షాపులకు సంబంధించిన ఈ పాస్ యంత్రాలకు జిల్లా కో ఆర్ఢినేటర్ గా పనిచేస్తున్నాడు… ఈ పాస్ యంత్రాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న శ్రీనివాస రాజు తనతోపాటు కొంతమంది రేషన్ డీలర్లతో కలిసి ప్రతి నెలా వారికి కేటాయించిన రేషన్ బియ్యం, చెక్కర ను అక్రమంగా డ్రా చేస్తూ వేల టన్నులు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నాడు.. రేషన్ నిల్వలలో తేడాలు రావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల్లూరు క్రైం పోలీసులు విచారణ ప్రారంభించారు.. ఇందులో ఈ పాస్ యంత్రాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ , డిఎస్ ఓ ల పాస్ వర్ఢ్ తెలుసుకొని తద్వారా ఈ పాస్ యంత్రాల నుంచి రేషన్ కోటాను డ్రా చేస్తున్నట్లు పనిగట్టారు.. ఇందులో ప్రమేయం ఉన్న ప్రధాన ముద్దాయి శ్రీనివాసరాజుతో పాటు 37 మంది డీలర్లను అరెస్ట్ చేసినట్లు క్రైం పోలీసులు తెలిపారు.. వీరి వద్ద నుంచి పది లక్షల విలువైన బియ్యం, చెక్కరను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..

SHARE