గిరిపుత్రికా కల్యాణం పథకం ద్వారా రూ. 50వేలు ఆర్థికసాయం

128

The bullet news ( Kovuru)_ గిరిపుత్రికా కళ్యాణము పథకం గిరిజనులకు గొప్ప వరమని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.. ఇవాళ కొడవలూరు మండలం కొత్త వంగల్లుకు చెందిన పట్రా సుధా అనే గిరిజన యువతి కి గిరి పుత్రిక కల్యాణ పథకం ద్వారా రూ.50000 అందజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన యువతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.. ఈ పథకం ద్వారా గిరిజన యువతులకు ప్రభుత్వమే పెళ్లి ఖర్చులు భరిస్తుందన్నారు.. ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ఈ గిరిపుత్రికా కల్యాణం పథకం వలన గిరిజన కుటుంబాలలో సంతోషంగా నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చక్కా నారయ్య, డిస్ట్రిబ్యూటరి కమిటీ అధ్యక్షుడు చక్కా మదన్ పాల్గొన్నారు.

SHARE