పాకిస్థాన్‌లో వడదెబ్బకు 65మంది మృతి…

73

THE BULLET NEWS (KARACHI)-పాకిస్థాన్‌ లో వడదెబ్బ కారణంగా సుమారు 65మంది మృతి చెందారు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా అక్కడ జనాలు వడదెబ్బకు లోనౌతున్నారు. మూడురోజుల్లోనే కరాచీ ప్రాంతంలో వడదెబ్బకు 65 మంది మరణించారు. రోజు రోజుకూ అక్కడ ముదురుతున్న ఉష్ణోగ్రతలతో మరింత మంది వడదెబ్బకు బలైపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

అందులోనూ ఇది రంజాన్ మాసం కావడం.. ఉపవాస దీక్షలు మొదలవడంతో పెద్దఎత్తున ప్రజలంతా పగటిపూట మంచి నీళ్లు కూడా ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య వరుసగా 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదౌతుంది. దీంతో ప్రజలు ఎక్కువగా వడదెబ్బకు గురై మరణిస్తున్నారు. కోరంగి, సోహ్రబ్‌గాత్‌లోని ఈదీ ఫౌండేషన్‌ మార్చురీలకు 3రోజుల్లో 114 మృతదేహాలు వస్తే… అందులో 65మంది వరకు వడదెబ్బతో మృతిచెందిన వారే ఉన్నారు.

SHARE