స్వీట్‌ పాన్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం..

176

THE BULLET NEWS (HYDERABAD)-ఎన్ని చట్టాలు అమల్లోకి తెచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. స్వీట్‌పాన్‌లో మత్తు పదార్థాలు కలిపి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేందర్‌ వర్మ కాచిగూడలో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ రెక్వెస్ట్ పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేయడంతో వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈక్రమంలో పెళ్లిచేసుకుంటానని నమ్మబలికిన ఆమెను పార్కులు, హోటళ్ల చుట్టూ తిప్పాడు. రోజులు గడుస్తున్నా తనను పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంలో అసలు రంగు బయటపెట్టాడు. ఆమె అశ్లీల వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడతానని బెదిరించాడని బాధితురాలు కాచీగూడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పార్కులు, హోటళ్ళ చుట్టూ తిరిగే సమయంలో స్వీట్‌పాన్లో మత్తుమంది కలిపి ఆమెకు ఇవ్వడంతో ఆమె మత్తులోకి జారుకునేది. ఆ సమయంలో ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు కూడా తీశాడని ఆమె ఆలస్యంగా గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉపేంద్రతోపాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. ఉపేందర్‌ పరారీలో ఉండగా అతని స్నేహితులను పోలీసలు అదుపులోకి తీసుకున్నారు.

SHARE