The Bullet News ( Nellore) _ రాష్టంలో కామాంధులు పేట్రేగిపోతున్నారు.. ఆడపిల్లలు కనిపిస్తే చాలు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పసిమొగ్గలను చిదిమేస్తున్నారు.. ప్రభుత్వాలే రంగంలోకి దిగి ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నా… కొందరు కామాంధుల్లో మార్పు రావడం లేదు.. మొన్న దాచేపల్లి, నిన్న బద్వేల్, చుండూరు, నెల్లూరు.. ఇవాళ తాజాగా నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది.. నగరంలోని వెంకటేశ్వరపురం శివారు ప్రాంతమైన గిరిజన కాలనీలో ఓ ఏడేళ్ల బాలిక బహిర్బూమికి వెళ్తుండగా శివయ్య అనే 50 ఏళ్ల వ్రుద్లుడు అత్యాచారానికి యత్నించాడు.. ప్రతిఘటించిన ఆ బాలిక కేకలు వేయడంతో పరారవుతుండగా స్థానికులు పట్టుకుని అతనికి దేహశుద్ది చేశారు.. చెట్టుకు కట్టేసి మరీ చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.. ఈ ఘటన జరుగుతున్న సమయంలోనే నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడబిడ్డలకు రక్షణగా నిలుద్దామని ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం కొసమెరుపు..

SHARE