కూలీ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యజమాని…

122

THE BULLET NEWS (KODAVALUR)-నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాలెం గ్రామంలో బట్టి వ్యాపారి రవీంద్ర నాయుడు వద్ద కొడవలూరు మండలం తాటకులదిన్నెకి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి పనిచేస్తున్నాడు .బట్టి వ్యాపారి రవీంద్ర నాయుడు కొంత నగదును అడ్వాన్స్ రూపంలో లక్ష్మయ్య కిచ్చి పనిలో పెట్టుకున్నాడు . లక్ష్మయ్య ఆరోగ్యం సరిగా లేదని ఇంటికి వెళ్లాడు .రవీంద్రనాయుడు లక్ష్మయ్య ఇంటికి వెళ్లి అతనిని అతని కుటుంబ సభ్యులను దుర్భాషలాడి అతనిని అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకుని వచ్చేశాడు .రవీంద్రనాయుడు లక్ష్మయ్యను మూడు రోజుల పాటు నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టి గాయాలు పాలు చేశాడు .లక్ష్మయ్య స్పృహ తప్పి పడిపోవడంతో రవీంద్రనాయుడు భయపడి నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు .లక్ష్మయ్యకు సృహ రావటంతో అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు .గాయాల పాలైనా లక్ష్మయ్యను కుటుంబ సభ్యులు చూసి కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు .ప్రథమ చికిత్స చేసిన కోవూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

SHARE