ఏపీ జెక్ కో వ‌ద్ద స‌మ్మె చేస్తూ అస్వ‌స్థ‌త‌కు గురైన కార్మికుడు రాము..- హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లింపు..

174

The bullet news (Muthgukuru)- ముత్తుకూరు ఏపీ జెన్ కో వ‌ద్ద కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న స‌మ్మెలో ఇవాళ చిన్న‌పాటి అప‌శృతి చోటు చేసుకుంది.. స‌మ్మ చేస్తూ రాము అనే కార్మికుడు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు.. దీంతో అత‌న్ని హుటాహుటిన అంబులెన్స్ ద్వారా హాస్ప‌టల్ కు తర‌లించారు.. మ‌రో ప‌క్క ఏపీ జెన్ కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె నాల్గో రోజుకు చేరింది.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదేళ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పట్టారు.. ఏపీ జెన్ కోకు తమ భూములిచ్చామని, కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌ను ప‌నిచేస్తున్న త‌మ‌ను రెగ్యుల‌ర్ చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.. నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారు వాపోతున్నారు.. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు..

SHARE