ఒక ఆత్మ‌హ‌త్య‌.. అనేక అనుమానాలు..

100

The bullet news (Gudur)-గూడూరులోని నారాయణ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చ‌దువుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌క్ష్మీసాయి మృతిలో అనుమానాలున్నాయంటూ గూడూరు ఏబీవీపి డివిజ‌న్ కార్య‌ద‌ర్శి మ‌నోజ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.. ఇవాళ ఒకటవ పట్టణ సీఐను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు.. ఈ సంద‌ర్బంగా మ‌నోజ్ మాట్లాడుతూ హా్స్ట‌ల్ ఉంటూ చ‌దువుకునే ల‌క్ష్మీసాయి హాస్ట‌ల్ రూమ్ కు ఎందుకు వెళ్లాడు..? అలా వెళ్తుంటే విద్యార్దులను పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపాల్, వార్డెన్ లు ఏం చేస్తున్నారు. హాస్ట‌ల్ లో రూ.1500 డ‌బ్బులు పోయిన వ్య‌వ‌హారంలో ప్రిన్సిపాల్ మంద‌లించ‌డం వ‌ల్లే ల‌క్ష్మీసాయి అవ‌మాన భారంతో నే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని విద్యార్దులు చ‌బుతున్నార‌ని ఆ దిశ‌గా కేసును ద‌ర్యాప్తు చేయాల‌ని మ‌నోజ్ కోరాడు.. సీసీ కెమెరాల‌లో రికార్డ్రైన దృశ్యాల ఆధారంగా ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌నోజ్ డిమాండ్ చేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో ఏబీవీపి నాయ‌కులు ఉన్నారు..

SHARE