డబుల్ బెడ్ రూమ్స్ వద్దంటు మహిళ ఆత్మహత్య…

175

THE BULLET NEWS (SIDDIPET)-డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వివాదాస్పందంగా మారింది. తమ పొలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించవద్దు అంటు ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని చిన్నకోడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ స్థలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపడతోందనే ఆరోపణలో కొంతమంది రైతులు అడ్డుకున్నారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి చిన్నకోడూరు పీఎస్ కు తరలించారు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళా రైతు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో చిన్నకోడూరు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

SHARE