అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్‌బై…

136

 

THE BULLET NEWS -సౌతాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియా వేదికగా తన రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను డివిలియర్స్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో.. ఇది చాలా కఠిన నిర్ణయం. ఈ నిర్ణయంపై చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి  ఇదే సరైన సమయం. నన్ను ఇంతకాలం ఆదరించిన సౌతాఫ్రికా బోర్డుకు కృతజ్ఞతలు. నాకు ఇంత కాలం సహకరించిన జట్టు సభ్యులకు..  ప్రపంపవ్యాప్తంగా నాకు మద్దతు  తెలిపిన అభిమానులకు నా ధన్యవాదాలు అని డివిలియర్స్ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కి మాత్రమే గుడ్‌బై చెబుతున్నానని.. డొమెస్టిక్ క్రికెట్‌కి మాత్రం అందుబాటులో ఉంటానని డివిలియర్స్ తెలిపాడు. వచ్చే సంవత్సరం 2019 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించడం సౌతాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డివిలియర్స్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ప్రపంచ క్రికెట్ అభిమానూలు తీవ్ర నిరాశకి గురయ్యారు. ఇక్కడ సంతోషకర విషయం ఏంటంటే.. వచ్చే సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ లలో మళ్ళీ డివిలియర్స్ మెరుపులను చూడొచ్చు.

2004 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సుమారు 14 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో డివిలియర్స్ 123 టెస్టుల్లో 8765 పరుగులు.. 228 వన్డేలలో 9577 పరుగులు.. 78 టీ-20లలో 1672 పరుగులు సాధించాడు. ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 141 మ్యాచ్ లు ఆడాడు డివిలియర్స్.

 

SHARE