అబ్బా.. ఏమి నటిస్తున్నావ్ సోమిరెడ్డి.. – ఎమ్మెల్యే కాకాణి కామెంట్..

75

The bullet news (Manubolu)_ ‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు వింటుంటే కన్నీరొస్తోంది. రైతులను తానేదో ఉద్దరిస్తున్నట్లు మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతున్నారు.. 6 లక్షల టన్నుల బీపీటీ ధాన్యాన్ని రైతులు నష్టానికి అమ్ముకున్న తర్వాత ధాన్యం రేటు పెంచడంలో మతలబేమిటి.? మంత్రి యాక్టింగ్ చూస్తుంటే రాజకీయ రంగస్థల నటుడు చంద్రబాబు నాయుడి నటను మించిపోతోంది‘ అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు..

ఇవాళ మనుబోలు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల వద్ద మంత్రి ముడుపులు తీసుకుని అన్నదాతల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు..జిల్లా యంత్రాంగం సోమిరెడ్డి మాటలు విని మిల్లర్ల పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతోందని ఆరోపించారు.. మిల్లర్లతో కుమ్మకై రైతులను బాధించే సోమిరెడ్డిని రైతు బంధువుడంటారా అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మంత్రి సోమిరెడ్డి వైఫల్యం చెందారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రకటించిన ధర కూడా రాకపోవడానికి సోమిరెడ్డి అవినీతి కారణమని
దుయ్యబట్టారు.. మినిస్టర్ ప్రకటనలు చూస్తుంటే దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేశారు..
రైతు దగ్గర ఎకరాకు 4 పుట్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలని ఆయన
ప్రశ్నించారు.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు..

SHARE