నగర టీడీపీ అభ్యర్దిగా అబ్దుల్ అజీజ్ పేరును పరిశీలిస్తున్నాం- ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్  వెల్లడి.

107

THE BULLET NEWS (NELLORE)-వచ్చె ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే అభ్యర్దిగా అబ్దుల్ అజీజ్ పేరును పరిశీలిస్తున్నామని.. అతన్ని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీదా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ కోరారు.. ఇవాళ స్థానిక మాగుంట లేవుట్ లోని హెచ్ ఎన్ ఆర్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన నెల్లూరుజిల్లా మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

ఆయనతో పాటు కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా షరీప్ మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గ ప్రజలను ఐక్యం చేసేందుకు అన్ని జిల్లాల్లో మైనార్టీ సోదరుల సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ
నెల 14వ తేదీన రాజధాని అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి మైనార్టీ సోదరుల ఆత్మీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారనీ, ముస్లిం సామాజిక వర్గ అభివృద్ధికి అవసరమైన ప్రధాన నిర్ణయాలను సభాముఖంగా ప్రకటిస్తారని
ఆయన వెల్లడించారు. మైనార్టీలకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను అర్హులందరూ వినియోగించుకుని, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని షరీఫ్ కోరారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీకి రాజకీయ భవిష్యత్తు
ఉండబోదనీ, రాబోయే ఎన్నికల్లో కనీసం కార్పొరేటరు స్థాయిలో కూడా గెలిచే అవకాశాలు లేవన్నారు..

ఈ సదస్సులో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొయునుద్దీన్, ముస్లిం మత పెద్ద ముఫ్తీ
ఇలియాజ్, నాయకులు మున్వర్ బాషా, కిర్మాణి సర్దార్, నన్నేసాహేబ్, మౌలానా, ఖాదర్ బాషా, హయత్, సమి, పఠాన్ బాషా, జహీర్, జంషీద్, జాఫర్,  మైథిలి మనోహర్ రెడ్డి, సాబీర్ ఖాన్, పాషా మొహిద్దీన్, గూడూరు నియోజకవర్గ నాయకులు
జలీల్, రహీం, షంషీర్ తదితరులు పాల్గొన్నారు

SHARE