రత్నమ్మ నర్సింగ్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి.. ఏబీవీపీ డిమాండ్….

237

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ 3-11-2019 న రత్నమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో చదువుతున్న కేరళకు సంబంధించిన సౌరవ్ ప్రసాద్(19) అనే విద్యార్థి ప్రక్కనే ఉన్న నీటి వాగులు పడి మరణించాడన్నారు.. దీనిపై విషయాలు వెలికి తీయగా నీటి వాగు పక్కనే నర్సింగ్ హోమ్ అనేది చట్టరీత్యా వ్యతిరేకం అంతేకాకుండా ఇప్పుడు ఒక ప్రాణమే బలైందన్నారు.. రేపు నీటిపారుదల పెరిగి నీరు పొంగి పొరలింది కొన్ని వందల ప్రాణాలు బలి అవ్వక తప్పదు దీని పట్ల ప్రభుత్వం స్పందించి దీనికి తగిన చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని ఆయన కోరారు..పంబలేరు వాగు పక్కనే కాలేజ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారో అధికారులు వెంటనే పరిశీలన చేయాలని వాగు పొంగినా కాలేజ్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఇలాగా విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాలేజీ ను వెంటనే సీజ్ చేయాలని మనోజ్ డిమాండ్ చేశారు..

అలాగే గూడూరు పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు కూడా కాలవ పక్కన వాగు పక్కన కళాశాలలో నిర్వహిస్తున్నారని వీటన్నిటి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు
అధికారులు వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కార్తీక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న నగర కార్యదర్శి శ్యామ్ ఏబీవీపీ నాయకులు జార్జ్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు