ఆదిశంకరా కాలేజి ఎదుట ఎబివిపి నాయకుడు ఆత్మహత్యాయత్నం.

390

THE BULLET NEWS (GUDUR)-గూడూరు ఆదిశంకరా లేడీస్ హాస్టల్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాధవి మృతిపై విచారణ జరపాలని, అనుమతి లేని ఆదిశంకర హాస్టల్ ని మూసేయ్యలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా ఎబివిపి చేస్తున్న నిరసన దీక్షలు ఇవాళ ఉద్రిక్తలకు దారితీశాయి.. కాలేజీలో జె ఎన్ టి యూ పరిధిలో ఇవాళ జరుగుతున్న క్రీడాపోటీలను నిలిపివేయాలంటూ ఎబివిపి కన్వీనర్ మనోజ్ కాలేజి ఎదుట ఆందోళన నిర్వహించారు.. కళాశాల యాజమాన్యం స్పందించక పోవటంతో జిల్లా కన్వీనర్ మనోజ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పైన పోసుకున్నాడు.. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులు విద్యార్థి నాయకులను అదుపులో కి తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

SHARE