ఏబీవీపి నిర్వహించిన సైన్స్ ఫెయిర్ స‌క్సెస్…

122

THE BULLET NEWS (GUDUR)-ఆక‌ట్టుకున్న ప్ర‌సంగాలు.. అబ్బుర‌ప‌రిచే ప్ర‌యోగాలు.. వంద‌ల సంఖ్య‌లో విద్యార్దులు.. ఇలా రెండు రోజుల‌పాటు గూడూరులోని జ‌డ్పీ బాలుర హైస్కూల్ లో ఏబీవీపీ చేప‌ట్టిన సైన్స్ ఫెయిర్ విజ‌య‌వంతమైంది.. చివ‌రి రోజైన ఇవాళ ముఖ్య అతిథులుగా గూడూరు డిఎస్పీ రాంబాబు, వెంక‌టగిరి వ్యాపార వేత్త దొంతు గోపీ హాజ‌రై విద్యార్దుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.. మొద‌ట గూడూరు డిఎస్పీ రాంబాబు మాట్లాడుతూ విద్యార్దుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు రోడ్డెక్కే ఏబీవీపివారిలోని సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్ ను నిర్వ‌హించ‌డం అభినందిచ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.. ఏబీవీపీ అన్నింటిల్లోనూ మేటి అన్నారు.. అనంత‌రం దొంతు గోపీ మాట్లాడుతూ ఏబీవీపి ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ కు అతిథిగా రావ‌డం, విద్యార్దుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు ఏబీబీపీ మ‌రెన్నోచేప‌ట్టాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.. ఏబీవీపీ చేసే మంచి కార్య‌క్ర‌మాల‌కు త‌న‌వంతు పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌న్నారు.. గూడూరు డివిజన్ కార్య‌ద‌ర్శి మ‌నోజ్ మాట్లాడుతూ ఏబీవీపీ భర‌త‌మాత సేవ‌కులే కాద‌ని, నేటి బాల‌ల‌ను భావిభార‌త పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ ముందుంటుద‌న్నారు.. విద్యార్దుల‌కు ఉప‌యోగ‌ప‌డే మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు భ‌విష్య‌త్ చేస్తామ‌ని రాష్ట కార్య‌ద‌ర్శి మ‌ల్లికార్జున తెలిపారు.. ఈ కార్య‌క్రమంలో బాలుర హైస్కూల్ హెచ్ ఎం ర‌వూప్, న‌గ‌ర అధ్య‌క్షులు దొర‌బాబు, న‌గ‌ర కార్య‌ద‌ర్శి చిన్న‌, డివిజ‌న్ కార్య‌ద‌ర్శి ర‌వి, సూర్య‌, కోటయ్య, శశి, తేజ, సుమంత్, జార్జి, అహ్మద్, హేమంత్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు..

బహుమతుల వివరాలు..
మొద‌టి బ‌హుమ‌తి – ర‌త్నం స్కూల్ గూడూరు
రెండో బ‌హుమ‌తి – జ‌డ్పీ స్కూల్, చిల్ల‌కూరు
మూడో బ‌హుమ‌తి – విఎస్ఆర్ స్కూల్ తో పాటు జ‌డ్పీ స్కూల్ నేల‌టూరు
నాలుగో బహుమతి – ప్రాస్ ప్రో ఇంగ్లీష్ మీడియం స్కూల్
ఐదో బహుమతి – జడ్పీస్కూల్ మనుబోలు..
ఉత్తమ ప్రాజెక్టు – మినర్వా,గూడూరు..

SHARE