నాయుడు పేట మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద్ ఇంటిపై ఏసీబీ రైడ్స్-10 కోట్ల అక్ర‌మాస్తులు గుర్తింపు

107

The bullet news (Naidupeta)- బంధువులే బినామిలే..అనుచ‌రులే అండ‌గా అవినీతికి పాల్ప‌డుతున్న మ‌రో క‌ర‌ప్ష‌న్ క‌మిష‌న‌ర్ ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో ఇవాళ తెల్లవారుజాము నుంచి నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్ అవినేని ప్రసాద్ నివాసాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.. మునిసిపల్ కమిషనర్ గా భారీగా ఆస్తులు కూడాబెట్టారన్న అభియోగాలు, ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.. ప్రాధ‌మికంగా 10 కోట్ల మేర అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు..

ఏక‌కాలంలో ఆరు చోట్ల సోదాలు..
ఇవాళ తెల్ల‌వారుజాము నుంచే ఏక‌కాలంలో క‌మిష‌న‌ర్ ప్ర‌సాద్ కు సంబంధించిన బంధువుల ఇళ్ల‌లో సోదాలు నిర్వహించారు.. తిరుప‌తిలోని ప్ర‌సాద్ స్వంత నివాసంతో పాటు నెల్లూరులో నివాసం ఉంటున్న ప్ర‌సాద్ కుమార్తె, క‌డ‌ప‌జిల్లా రాజంపేట‌లోని ఇద్ద‌రు స్నేహితుల ఇళ్లు, కాళ‌హాస్తిలో ఉంటున్న ప్ర‌సాద్ త‌ల్లి నివాసాల్లో సోదాలు నిర్వహించారు..

ఒంగోలుకు చెందిన ఏసీబీ ఇన్ స్పెక్టర్ టివివి ప్రసాద్ నేత్రుత్యంలో నలుగురు సభ్యలతో కూడిన బ్రుందం ఈ తెల్లవారుజాము నుంచి నాయుడుపేట మునిసిపల్ కమిషనర్ అవినేని ప్రసాద్ నివాసాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, అనుచరుల ఇళ్లలో ఈ ప్రత్యేక బ్రుందాలు సోదాలు చేస్తున్నాయి.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండేళ్ల క్రితం నాయుడుపేటకు కమిషనర్ గా వచ్చిన ప్రసాద్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులకు సమాచారమందినట్లు తెలుస్తోంది..

ఇప్ప‌టి వ‌రకు గుర్తించిన ఆస్తులు..
నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో ప్లాట్స్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.. తమ్మినాయుడుపాలెం, తుమ్మగుంట, అక్కారం, తిరుపతిలోని ఏన్జీవో కాలనీ , గాజులమండ్యం త‌దిత‌ర ప్రాంతాల్లో ప్లాట్లు, అలాగే తిరుపతి ఎన్ జీవో కాలనీలో ఐదు ప్లోర్ లు కలిగిన అపార్ట్ మెంట్లో రెండు ప్లాట్లు, కాళహాస్తిలో ఓ ఇళ్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

SHARE