ఆరోగ్యశాఖలో అవినీతి తిమింగలం…

175

THE BULLET NEWS (NELLORE)-ఆర్టిఓ కార్యాలయంలో సాధారణ అటెండర్ వందల కోట్ల అవినీతికి పాల్పడి ఎసిబికి చిక్కిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో కిందిస్థాయి ఉద్యోగి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా బుక్కయ్యారు మరో ఇద్దరు అవినీతి అధికారులు.. నెల్లూరుజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది..

ఓ వైపు ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ అవినీతి పరుల ఆట కట్టిస్తుంటే మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతున్నారు కొందరు ఉద్యోగులు.. సర్వీస్ రెగ్యులర్ చేసేందుకు అదే కార్యాలయంలో పని చేసే మహేష్ అనే ఉద్యోగి సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాస్ ని ఆశ్రయించాడు.. ఆయన రూ.30వేలు డిమాండ్ చేశాడు.. చివరికి 25వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న మహేష్ ఏసీబీని ఆశ్రయించాడు.. మరో ఉద్యోగి గోపాల్ ద్వారా 25 వేలు లంచం సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాస్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టున్నారు.
శ్రీనివాస్, గోపాల్ లను అదుపులోకి తీసుకున్న ఏసిబి అధికారులు విచారిస్తున్నారు..

SHARE