డిఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు…

132

THE BULLET NEWS (SRIKAKULAM)-ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ డిఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. శ్రీనివాసరాజు ఇంటితో సహా అతని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. విశాఖ, భీమవరం, పాలకొల్లు మొత్తం పది చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులలో ఆదాయానికి మించిరూ.20కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. దెందులూరులో 32 ఎకరాలు, సీతమ్మధారలో ఒక ఫ్లాట్, భీమవరంలో 5 ఇళ్ళ స్థలాలు.. సీతమ్మధారలోని శ్రీనివాసరాజు ఇంట్లో రూ.12.50లక్షలు, 150 గ్రాముల బంగారం, కిలో వెండితో పాటు 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు ఏసీబీ అధికారులు.

SHARE