The bullet news ( ఆత్మకూరు ) :-  ఆత్మకూరు లో నిర్మించిన హౌసింగ్ ఫర్ అల్ గృహ సముదాయం ఆత్మకూర్ వాసులకు మంచి కానుక మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు ఆత్మకూర్ లో హౌసింగ్ ఫర్ ఆల్ ఆన్లైన్ లక్కి డిప్ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణం ఇప్పుడు సుందరమైనది గా ఉందని ఆయన తెలిపారు గత 40 ఏళ్లుగా నేను ఆత్మకూరును చూస్తున్నానని అప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ఆత్మకూరు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా రూపుదిద్దుకుందని చెప్పారు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ విద్యాసంస్థలు పార్కులు ఎన్నో ఉన్నాయని తెలిపారువంద కోట్లతో సిమెంట్ రోడ్లు మౌలిక సౌకర్యాలకు కేటాయించామన్నారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యాయని చెప్పారు ముస్లిం సోదరులు షాది మంజిల్ కావాలని అడిగారని చెప్పారు అందుకుగాను ముఖ్యమంత్రితో సంప్రదించి రెండున్నర కోట్ల రూపాయలను కేటాయించామన్నారు మరో 70 లక్షల రూపాయలను మున్సిపాలిటీ కేటాయించిందని తెలిపారు 3.20 కోట్ల రూపాయలతో అధునాతనంగా షాది మంజీలునిర్మిస్తామని
చెప్పారు ఈ గృహ సముదాయం అద్భుతంగా కట్టారని తెలిపారు మంత్రి నారాయణ నిర్మాణంలో చాలాశ్రద్ద తీసుకున్నారని తెలిపారు ఈ నిర్మాణ సమయంలో లబ్ధిదారుల సూచనలు కూడా తీసుకున్నారని అందువల్లనే చక్కగా వచ్చాయని ప్రసంసించారు. ఈ గృహ సముదాయంలో మూడు లక్షల రూపాయల సబ్సిడీ లభిస్తుందని చెప్పారు అంతే కాకుండా కమ్యూనిటీ హాల్ రోడ్డు సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు నాలుగు వేల మంది నివసించే ఈ ప్రాంగణం అన్ని సౌకర్యాలతో అందరికీ ఆదర్శప్రాయమైన ప్రాంతంగా మారనుందని చెప్పారు ఇక వీళ్లకు రుణ సౌకర్యం విషయంలో ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ ఇల్లు తీసుకున్న వారు చాలా సుఖంగా జీవనాన్ని గడపవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పండుగల సమయాలలో పెళ్లిళ్ల సమయంలో కానుకలు ఇస్తూ పేదలకు సహాయ పడుతున్నారని చెప్పారు అలాగే చంద్రన్న బీమా తో పాటు సీఎం సహాయనిధి వంటి పథకాలతో అనుకుంటున్నారని తెలిపారు అందువల్ల చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్య కంభం విజయరామిరెడ్డి గిరినాయుడు ఖాజావలి పాముల హరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

SHARE