బుగ్గైన బతుకులను ఆదుకోండి – బోయ సామాజికవర్గ మేధావులు ప్రభుత్వానికి వేడుకోలు

131

The bullet news (Kurnool)- కూలి ప‌నులు చేసుకుని బ్ర‌తికే ఆ కుటుంబాల‌పై య‌మ‌ధ‌ర్మ‌రాజు య‌మ‌పాశం విసిరాడు. అంతే ఆ య‌మ‌పాశం7 మందిని త‌న‌తో తీసుకువెళ్లింది. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. కూటికోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాల‌కు చేరుకున్నారు. రెండు నెల‌ల క్రితం తెలంగాణా రాష్ట్రంలోని న‌ల్గొండ జిల్లాలో ప‌త్తి కోసేందుకు వెళ్లిన క‌ర్నూలు జిల్లా హోళగుంద మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వ‌ల‌స కూలీలు, ప‌నులు ముగించుకుని తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో వారు వ‌స్తున్న మినిటిప్ప‌ర్ టైర్ పంచ‌ర్ అయ్యి ఒక్క‌సారిగా బోల్తాప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 7 మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌ద‌ల‌గా, మ‌రో 11 మంది తీవ్ర‌గా గాయ‌ప‌డ్డారు. ఈ విషాద సంఘ‌ట‌న ఆస్ప‌రి మండ‌లం చిన్న హోతూరు వ‌ద్ద చోటు చేసుకుంది. ఈ విషాద సంఘ‌ట‌న‌తో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. వీరందరూ ఓకే ప్రాంతానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.. తెలుగు రాష్టాల్లో బాగా వెనుకబడిన కులాల్లో ఒక్కటైన బోయజాతికి చెందిన ఏడుగురు అక్కడిక్కడే మ్రుతిచెందారు..

ప్రభుత్వ నిర్లక్ష్యం..

మ్రుతిచెందిన వారందరికీ కాస్తో కోస్తో పొలం ఉంది.. కరువు విలయతాండవం చేస్తుండటంతో వారు పొ్ట్టచేతపట్టుకుని తెలంగాణా రాష్టానికి వెళ్లారు.. వీరందరికీ స్వగ్రామంలోనే ఉపాధి పనులు కల్పించి ఉంటే వారి కుటుంబాల్లో ఈ పెను విషాదం నిండేదే కాదు.. ఈ ఘటనపై ప‌లువురు మేధావులు, ప్ర‌జా సంఘాలు స్పందించారు. అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పొట్ట‌కూటి కోసం ఎంతో మంది వ‌ల‌స బాట ప‌డుతుంటం చాలా బాధ‌క‌ర‌మ‌ని అంటున్నారు. వ‌ల‌స‌కూలీల జీవితాల‌ను బాగు చేయ‌డం కోసం ప్ర‌భుత్వాలు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని మండిప‌డుతున్నారు. ఆస్ప‌రి మండ‌లం చిన్న హోతూరు వ‌ద్ద చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతి చెందిన 7 మందికి ప్ర‌భుత్వం వెంట‌నే 10ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా ఇవ్వ‌డంతోపాటూ, చంద్ర‌న్న బీమా ద్వారా ఆ కుటుంబాల‌కు న‌గ‌దు ఇచ్చి ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి, ఉపాధి హామి ప‌నుల‌ను క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు అధిక నిధులు కేటాయించి, ఆ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటూ, అక్క‌డ ఉన్న ప్ర‌జ‌ల‌కు ఉపాధి హామి ప‌థ‌కం ద్వారా ప‌ని క‌ల్పించ‌డంతోపాటూ, ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ఫ‌లాలు వారికి అందే విధంగా చూడాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. బోయసామాజికవర్గానికి చెందిన మంత్రులు, మేధావులు దీనిపై స్పందించి వారికి సాయం అందేలా చూడాలని వారు కోరుకుంటున్నారు..

SHARE