మంత్రి తీసుకొచ్చారా లేక ఆయనే వచ్చారా..?

354

THE BULLET NEWS (KOVUR)-

చాలా రోజులకి పార్టీ కార్యక్రమంలో తళుక్కుమని మెరిసిన పెళ్లకూరు.

గత కొంత కాలం నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. తన వర్గానికి ఆర్థికంగా అండగా ఉంటూ వస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇవాళ కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో తళుక్కుమని మెరిశారు..

కోవూరు మండలం ఇనమడుగులోని ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు కు బయలుదేరిన మంత్రికి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి తారసపడ్డారట.. దీనితో మంత్రి పెళ్లకూరు ని మహానాడుకు రావాల్సిందిగా ఆహ్వానించారని, అందుకే పెళ్లకూరు వచ్చారని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మహానాడు మధ్యలో మంత్రి సోమిరెడ్డి వెళ్తుండగా ఆయనతో పాటు పెళ్లకూరు కూడా వెళ్లిపోయారు..

SHARE