తల్లి శవంపై నుంచి అఘోరా పూజలు

79

The bullet news (viral)-  అతని ఓ అఘోరా… అకస్మాత్తుగా అతని తల్లి చనిపోయింది. విషయం తెలిసుకుని ఆత్మ కాళీమాతలో ఐక్యచేయాలంటూ తల్లి శవంపై కూర్చొని సహచర అఘోరాలతో కలసి పూజలు చేశాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు కొద్ది సేపు హడలెత్తిపోయారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన మణికంఠన్‌ అఘోరా.. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మొన్న మరణించింది. విషయం తెలుసుకున్న మణికంఠన్ 20 మంది అఘోరాలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ మణికంఠన్‌ తల్లి శవంపై కూర్చున్నాడు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. చిత్రవిచిత్రమైన పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ బిగ్గరగా అరుస్తూ, పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. ఆతర్వాత తల్లి భౌతికకాయానికి దీపారాధనలు చేసి ఖననం చేశారు.

SHARE