THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాలుచింతల, వారధి సెంటర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు జ‌రుగుతున్నాయి.. ముంద‌స్తు స‌మాచారం లేకుండానే త‌మ నివాసాల‌ను కూల్చేస్తున్నార‌ని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ముందస్తుగానే బ‌ల‌గాల‌ను మోహ‌రించి నివాసాల‌ను కూల్చేస్తున్నారు.. ఈ సాలుచింత‌ల‌, వారధి సెంట‌ర్ కోవూరు నియోజ‌క‌వ‌ర్గంతో పాటు నెల్లూరు సిటి ప‌రిధిలోకి వ‌స్తుంది.. దీంతో విష‌యం తెలుసుకున్న వైసీపీ సిటి నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు రూప్ కుమార్ యాద‌వ్ తో పాలు ప‌లువురు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.. ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఎలా నివాసాల‌ను కూల్చేస్తార‌ని వారు అధికారుల‌తో మాట్లాడ‌తున్నారు.. ఇదే స‌మ‌యంలో కోవూరు నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా బాధితుల త‌ర‌పును మాట్లాడేందుకు ఘ‌ట‌నా స్థ‌లానికి రాలేదు.. దీంతో స్థానిక నేత‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.. కోవూరు పరిధికి సంబంధించి దాదాపు 58 ఇల్లు లు ఉండగా వారిలో కేవల పది కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించారు.. మిగతా వారికి పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ఇల్లులు కూల్చేస్తున్నారు.. దీనితో అధికార పార్టీ నేత ఎమ్మెల్యే గా ఉన్న‌ప్ప‌టికీ క‌నీసం బాధితుల‌కు అండగా నిల‌బ‌డటం లేద‌ని వారు వాపోతున్నారు.. ఓట్లడిగే స‌మ‌యంలో మాత్రం ఇంటింటికి తిరిగి ఓట్ల‌ అడిగే నాయ‌కులు ఇలాంటి స‌మ‌యంలో త‌మ‌కు అండగా నిల‌బ‌డ‌కుండా ఉండ‌టం ప‌ట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు..

SHARE