మీ అందరూ రాబోయే రోజుల్లో కాబోయే శాస్త్రవేత్తలే.. – మంత్రి సోమిరెడ్డి

95

The bullet news (Nellore)-   రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి సారించిందని వ్వవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఅన్నారు.. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసఫ్ స్కూలులో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు అవకాశాలను సద్విని యోగం చేసుకుని సరికొత్త సైన్స్ ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.. విద్యరంగం అభివ్రుద్ది కోసం ప్రభుత్వం క్రుషి చేస్తోందన్నారు.. అందులో భాగంగా దాదాపు రూ. 20,384 కోట్లు కేటాయించిందన్నారు.. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిత పొంది సమాజంలో తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలు ఇనుమడింపచేయాలని పిలుపునిచ్చారు. మన పొలాల్లోనూ సైన్స్ ఆవిష్కరణలు ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తేవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడులు వచ్చేందుకు అండగా నిలుస్తోందన్నారు. ఇక్రిశాట్ సహకారంతో ఆన్ లైన్ విధానంలోనే తెగుళ్ల నిర్ధారణ, నివారణ చర్యలు రైతులకు సూచిస్తున్నాం. ప్రతి ఒక్కరూ టెక్నాలజిపై అవగాహన పెంచుకోవాలన్నారు..

SHARE