ఆత్మకూరు ప్ర‌భుత్వ‌ వైద్య‌శాల‌లో అన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాం – మాజీ మంత్రి ఆనం

119

The bullet news (Atmakuru)- నాణ్య‌మైన వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలుగుదేశం ప్ర‌భుత్వం పనిచేస్తోంద‌ని మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు.. జన్మభూమి – మా ఊరు కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ ఆయ‌న క‌చిరిదేవ‌రాయ‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు.. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ఆత్మ‌కూరు ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్ లో అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు.. గ్రామీణ‌, మారుమూల ప్రాంత ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు.. డాక్ల‌ర్లు నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామ‌న్నారు.. ప్ర‌భుత్వం ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌న్నారు.. అందులో భాగంగా బ‌డ్జెట్లో వంద‌ల కోట్ల కేటాయిస్తోంద‌న్నారు..ప్ర‌యివేట్ వైద్య‌శాల కంటే ప్ర‌భుత్వ వైద్య శాల‌లోనే మెరుగైన వైద్యం అందుతుంద‌న్నారు.. జ‌న్మ‌భూమి కార్య‌క్రమంలో స్థానికంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతున్నామ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మ‌లో స్థానిక టీడీపీ నేత‌లు పాల్గొన్నారు..

SHARE