టిడిపి పార్టీకి ఏ పార్టీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు – మంత్రి అమరనాథ రెడ్డి

72

THE BULLET NEWS (PALAMANERU)- కేంద్ర బడ్జెట్ పై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంది.ఆనాడు ప్రతిపక్షంలో ఉంటూ రాష్ర్టాన్ని విభజిస్తే ఏపికి అన్యాయం జరుగుతుందని, ఏం చేస్తే బాగుంటుందో సలహాలు ఇచ్చిందీ బీజేపీనే .రాష్ర్ట విభజనతో పూర్తిగా ఆర్థికంగా నష్టాల్లోకి మునిగిపోయిన ఏపికి ఏదో ఒక దశలో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఇనాళ్లూ రాష్ర్ట ప్రజలు, ముఖ్యమంత్రిగారు వేచిచూశారు. ఆఖరి బడ్జెట్  ఏపీని సంతృప్తి పరిచేలా ఉంటుందని భావించాం.అయితే దురదృష్టవశాత్తు రాష్ర్టానికి పూర్తి అన్యాయం జరిగింది. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కేంద్రపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది .అలా కాకుండా రాజకీయ కోణంలో మరోవిధంగా వెళ్లి రాష్ర్ట ప్రయోజనాలను దెబ్బ తీయాలని భావిస్తే ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారు .రాష్ర్ట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కేంద్రంతో ఈ రోజు వరకు కలిసి నడుస్తున్నాం.హోదా సాధ్యం కాదు.. హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే రాష్ర్ట భవిష్యత్తు కోసం సరే అన్నాం.ఇకపైనైనా ఏపికి ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.  కేంద్రం ఇస్తున్న నిధులకు రాష్ర్ట ప్రభుత్వం లెక్కలు చూపించడం లేదనే వాదన అర్ధరహితమైంది.అంతేకానీ ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం దేనీకి సంకేతం.బీజేపీ తీరు ఇలాగే కొనసాగితే  కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది.

SHARE