అద్బుతాల‌కు అక్ష‌ర‌రూప‌మే గ్రంధాల‌యాలు – మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి

90

The bullet news (Tirupathi)- ప్ర‌పంచంలో జ‌రిగే అద్బుతాలు.. అక్ష‌రాల రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చే చోటే గ్రందాల‌య‌మ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖామంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి తెలిపారు..  తిరుపతిలో దాదాపు రూ.1.22 కోట్లతో నిర్మించిన శాఖా గ్రంథాలయాన్నిఆయ‌న ఇవాళ ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అన్ని వసతులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే కలను నా చేతుల మీదుగా ఏర్పాటు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. తిరుపతిలోని పాఠకులు, నిరుద్యోగ యువత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయం చక్కగా ఉపయోగపడుతుంద‌న్నారు.. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు.. గ్రంథాలయాల్లో పనిచేయడానికి త్వరలోనే నియామకాలు చేపడతామ‌న్నారు.. అనంత‌రం ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమము మరియు అభివృద్ది సంస్థ, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహిళా ప్రాంగణంలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమానికి ఆయ‌న‌, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత ఎంపి శివప్రసాద్ , ఎమ్మెల్సీ దొరబాబు, కలెక్టర్ ప్రద్యుమ్న, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ,తుడా చైర్మన్ నరసింహ యాదవ్ , తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు..

SHARE