గండిపాలెం ప్రాజెక్టులో గుర్తుతెలియ‌ని మృత‌దేహం ల‌భ్యం

105

The bullet news (Udayagiri)- నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి మండ‌లం గండిపాలెం రిజ‌ర్వాయ‌ర్ లో గుర్తు తెలియ‌ని మృత‌దేహం లభ్య‌మైంది.. రిజ‌ర్వాయ‌ర్ లో మృత‌దేహం ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచార‌మందించ‌డంతో వారు అక్క‌డ‌కు చేరుకుని మృత‌దేహాన్ని వెలికితీశారు.. పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు మృతుడు ఎర్ర‌ని చొక్కా, తెల్ల‌ని పంచె ధ‌రించి ఉన్నాడు. వ‌య‌స్సు సుమారు 45 సంవ‌త్స‌రాలలోపు ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.. ఇది ఆత్మ‌హత్యా లేక హ‌త్య అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్న‌ట్లు సమాచారం…

SHARE