ఆనం ఈజ్ బ్యాక్ విత్ నయా జోష్

245

The Bullet News ( Political) _ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫ్యాన్ కిందకు వెళ్లారు.. టిడిపి లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అంతర్గత కుమ్ములాటలు నేపథ్యంలో కొంతకాలంగా ఆ పార్టీ కి దూరం గా ఉన్న ఆనం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు..

జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. విశాఖ పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఆనంతో పాటు అం వివేకా తనయుడు రంగమయూర్, ప్రధాన అనుచరులు కొందరు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనం చేరికతో నెల్లూరు వైసీపీలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఆనం ఎక్కడ నుంచి పోటీ
చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నేత వివేకానందరెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు రామనారాయణరెడ్డి ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆత్మకూరు ఇన్‌చార్జిగా నియమించారు. అయితే టీడీపీలో తగిన గుర్తింపు దక్కలేదనే భావనతో ఆనం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మినీ మహానాడు వేదికపై నుంచి ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని విమర్శించడం ద్వారా పార్టీ మారుతున్న సంకేతాలను అందజేశారు. వైసీపీ నాయకులతో మూడు నెలల పాటు జరిపిన చర్చల అనంతరం కొద్ది రోజుల క్రితం ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆనం ప్రకటించారు.

SHARE