టీడీపీకి ఆనం గుడ్ బై..? నేడో, రేపో పార్టీకి రాజీనామా..

218

THE BULLET NEWS (NELLORE)-సైకిల్ పార్టీపై అసంత్రుప్తితో ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు.. వైసీపీ అధిష్టానం నుంచి సీటు విషయంలో క్లారీటీ రావడంతో ప్యాన్ కిందకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.. కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ కు జై కొట్టేందుకు ఆయన రెడీ అవుతున్నారట.. ఎన్నికలకు ఏడాది గడువున్నప్పటికీ నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. ఎవరు ఏ పక్క నుంచి బాంబు పేలుస్తారో అర్దం గాక అటు జిల్లా నేతలు, కార్యకర్తలు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. నిన్నటి వరకు తన రాజకీయ పయనం ఎటోవైపు అన్నది తేల్చుకోకుండా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది. దాంతో పాటు నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన మహానాడులో మంత్రి సోమిరెడ్డిపై, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని స్వంతపార్టీ నేతలే ప్రచారం చేశారు.. అదీగాక విజయవాడలో జరిగిన మహానాడుకు సైతం ఆనం హాజరుకాకపోవడం ఆ ప్రచారాలకు బలం చేకూరినట్లయింది.. మరో పక్క ఆత్మకూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ అభ్యర్దిత్వంపై నిర్వహించిన సర్వేలో ఆనం పేరు లేదట.. దీని బట్టి చూస్తే ఆనం వైసీపీ జంప్ అవ్వడం ఖాయమని టీడీపీ అధిష్టానం గుర్తించి మరో బలమైన క్యాండిడేట్ ను వెతుక్కునే పనిలో పడినట్లు దీనిని బట్టి తెలుస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనం కుటుంబానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంత్రుప్తిలో ఆనం ఉన్నారట.. ఆ మనోవేదనతోనే ఆనం వివేకా కూడా కన్నుమూశారని ఆయన అనుచరులు చెప్పుకొంటుంటారు. ఆనం వివేకా బతికుండగానే వైసీపీలో వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ అది కుదర్లేదు.. వివేకా చనిపోవడం, ఆయన అంతిమయాత్ర రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో ఆ ప్రచారాలకు టెంపరరీగా బ్రేక్ పడింది.. ఇక్కడే వైసీపీ పెద్దలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స ఆనంతో మంతనాలు జరిపి సీటుపై క్లారిటీ ఇవ్వడంతో మరోసారి ఆనం వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు నుంచే ఆనం రామనారాయణరెడ్డిని రంగంలోకి దించేందుకు ప్యాన్ పార్టీ కూడా ఓకే చెప్పడంతో ఆనం రేపు మాపో టీడీపీకి గుడ్ చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.. ఇదే జరిగితే జిల్లాలో వైసీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి..

SHARE