ప్రభుత్వం పై బాంబ్ పేల్చిన మాజీ మంత్రి ఆనం….

499

THE BULLET NEWS (ATMAKUR)-మాజీ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ చార్జి ఆనం రామనారాయణ రెడ్డి మినిమహానాడు వేదికగా బాంబ్ పేల్చారు.. తన అక్కసును వెళ్లగక్కారు.. అసంత్రుప్తిని మంత్రి నారాయన సాక్షిగా బయటపెట్టారు.. మంత్రి నారాయణ సమక్షంలో మరో మంత్రి సోమిరెడ్డి తీరును తూర్పారబట్టాడు..
ప్రభుత్వంలో లోపాలనున్నాయంటూ మినీమహానాడు వేదికగా ఎత్తి చూపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదంటూ వేదికపై నుంచే పాలక పక్షంతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్లుగా విమర్శలు సంధించాడు..

ఆనం టీడీపీలోనే కొనసాగుతారన్న జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారాయి.. టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా ఆనం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి..

ప్రభుత్వంపై ప్రజలు 80శాతం సంత్రుప్తితో ఉన్నారని అధికారులు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారని ఆనం ఘాటైనవ్యాఖ్యలు చేశారు.. ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు.. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డిపై కూడా సెటైర్లు వేశారు.. వ్యవసాయశాఖామంత్రి ఉండి కూడా రైతులను పలకరించే పరిస్థితి లేదన్నారు.. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏనాడు ఇన్ని అవమానాలు పడలేదన్న ఆయన

అధికార పార్టీ ఇంచార్జిగా ఉండి కూడా చార్జింగ్ మాత్రం లేదన్నారు.. ఎస్ ఐ కూడా తాను చెబితే వినే పరిస్థితి నియోజకవర్గంలో లేదన్నారు.. స్వంత పార్టీ నుంచే తనకు సహకారం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

SHARE