ముహూర్తం ఖరారు.. సెప్టెంబర్ 2 న వైసీపీలో చేరిక…

158

THE BULLET NEWS (NELLORE):-మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సెప్టెంబర్ 2న వైసీపీలో చేరుతున్న్నట్లు తెలుస్తోంది.. గత నెలలో వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ఆనం.. శ్రావణమాసంలో పార్టీలో చేరుతానని జగన్ కు తెలిపారు.. టీడీపీలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రానప్పటికీ ఆత్మకూరు లేదా వెంకటగిరి, అది కూడా కుదరకపోతే సర్వేపల్లి నుంచి
పోటీలో ఉండే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.. జిల్లా అంతట
బలమైన అనుచరులున్న మాజీ మంత్రి ఆనం వైసీపీలో చేరడం పార్టీకి బలం చేకూరే అవకాశాలున్నాయి..

SHARE