కొంచం లేట్ అయింది.. కానీ సెప్టెంబర్2న వైసీపీ లోకి వెళ్తున్నా.. – మాజీ మంత్రి ఆనం క్లారిటీ..

337

THE BULLET NEWS (NELLORE):-నెల్లూరు జిల్లాలో టిడిపికి ఎదురుదెబ్బ తగిలింది.. అందరూ అనుకుంటున్నట్లు గానే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫ్యాన్ కిందకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్2న రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజున వైసీపీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తలు, ఆత్మీయులతో సమావేశం నిర్వహించిన ఆయన అనకాపల్లి లో వైసీపీ చేపట్టబోయే బహిరంగ సభలో పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు..నెల్లూరులోని సంతపేటలో ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.. కొన్ని పరిస్థితుల్లో టిడిపిలో చేరినప్పటికి జగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యడం కోసం వైసీపీలో చేరుతున్నట్లు ఆయన అన్నారు.. ఇది వరకే జిల్లా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రి ఆనంతో భేటి అయ్యారు.. పార్టీలోకి ఆహ్వానించారు.. మాజీ మంత్రి ఆనం స్వయంగా మాజీ ఎంపీ మేకపాటి నివాసానికి వెళ్లి పార్టీ చేరికపై మాజీ ఎంపీ తో మాట్లాడారు.. దీనితో అనుచరులతో ఆనం నిర్వహించిన ఆత్మీయ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆనం… ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు…

SHARE